హైదరాబాద్ ను బీజేపీ అంబానీకి అమ్మేస్తుందట.. ఈ మాట ఎవరన్నారో తెలుసా..?

Srinivas Goud Comments On BJP. జీహెచ్ఎంసీ ఎన్నికలు అతి త్వరలో జరుగుతూ ఉండడంతో అప్పుడే మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  22 Nov 2020 12:58 PM GMT
హైదరాబాద్ ను బీజేపీ అంబానీకి అమ్మేస్తుందట.. ఈ మాట ఎవరన్నారో తెలుసా..?

జీహెచ్ఎంసీ ఎన్నికలు అతి త్వరలో జరుగుతూ ఉండడంతో అప్పుడే మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా అధికార టీఆర్ఎస్ కు మరో షాక్ ఇవ్వాలని భావిస్తోంది. కానీ ఈసారి మాత్రం బీజేపీని తేలికగా తీసుకోకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారాన్ని హైదరాబాద్ నగరంలో మొదలు పెట్టేసింది.

తాము కాకుండా ఏ పార్టీ వచ్చినా హైదరాబాద్ లో మతకల్లోలాలు తప్పకుండా జరుగుతాయని.. ప్రశాంతమైన హైదరాబాద్ టీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యమని చెబుతూ వస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ మీద టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శనాస్త్రాలను సంధించారు. బీజేపీని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రంపై చార్జిషీట్ వేయాలని అన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణకు క్షమాపణలు చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రుల మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు.

గతంలో ప్రధాని సైతం కేసీఆర్ ను ప్రశంసించారని, కానీ ఇప్పుడు ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు. తాము మేయర్ పదవిని ఎంఐఎంకు ఇస్తామని ప్రచారం చేస్తున్నారని, ఇది హాస్యాస్పదమైన విషయం అని శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఆదివారం హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ దీనిని విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా అని.. హైద్రాబాద్‌ను డల్లాస్ నగరం చేస్తామని.. వరదల‌ నగరంగా మార్చారర‌ని ఎద్దేవా చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని.. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదని ఫైర్ అయ్యారు.


Next Story
Share it