Video: వాహనం ఢీకొని చిరుతకు తీవ్రగాయాలు.. మృత్యువుతో పోరాడి..

మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలోని వల్లూరులో అటవీ నర్సరీ సమీపంలో గురువారం సాయంత్రం చిరుతపులిని వాహనం ఢీ కొట్టింది.

By అంజి
Published on : 31 Jan 2025 9:20 AM IST

Speeding Vehicle Kills Leopard, NH-44, Medak , Telangana

Video: వాహనం ఢీకొని చిరుతకు తీవ్రగాయాలు.. మృత్యువుతో పోరాడి.. 

మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలోని వల్లూరులో అటవీ నర్సరీ సమీపంలో గురువారం సాయంత్రం చిరుతపులిని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుతపులికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడిన చిరుత.. చివరకు విగతజీవిగా మారింది. జాతీయ రహదారి 44 దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొని ఆడ చిరుత మృతి చెందింది. చిరుతపులికి ఆరు, ఏడేళ్ల వయస్సు ఉంటుందని, ఆరోగ్యంగా ఉన్నట్లు మెదక్ జిల్లా అటవీ అధికారి ఎం. జోజి తెలిపారు. ఈ చిరుత నర్సరీలోని చెక్ డ్యామ్‌కు నీరు తాగడానికి నిత్యం వస్తూ ఉంటుందని, ఈ ఘటనకు ముందు రెండుసార్లు చిరుత కనిపించిందని అతను చెప్పాడు.

అనేక ఇతర వన్యప్రాణులు కూడా నీరు తాగేందుకు చెక్ డ్యాం వద్దకు వస్తాయని తెలిపారు. చిరుతపులి జాతీయ రహదారి సగం దాటగా, డివైడర్‌ను దాటబోతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. సమీపంలో ఒక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఉంది. ఇది చిరుతపులికి సరైన నివాసంగా ఉండేదని అధికారి తెలిపారు. అనేక వన్యప్రాణులు NH 44 యొక్క ఆ విస్తీర్ణాన్ని ఉపయోగిస్తున్నందున, జంతువులను రోడ్డుకు ఒక వైపు నుండి మరొక వైపుకు సురక్షితంగా దాటడానికి వన్యప్రాణి అండర్‌పాస్ లేదా ఓవర్‌పాస్ అవసరం అని ఆయన తెలిపారు.

Next Story