స్కూల్‌ పిల్లలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Speeding lorry hits school students, one killed, three injured. అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి  Published on  2 Dec 2022 4:12 PM IST
స్కూల్‌ పిల్లలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హృదయ విదారకమైన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గొల్లపల్లిలో బస్సు కోసం ఎదురు చూస్తున్న పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులను వేగంగా వచ్చిన లారీ ఢీకొని ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ చక్రాల కింద నలిగి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతి చెందిన బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి బడికి వెళ్లిన కుమారుడు.. తిరిగి రాని లోకాలకు పోవడంతో తల్లిదండ్రులు గుండలవిసేలా రోదిస్తున్నారు. లారీ ఢీకొన్న ఘటనలో మూగజీవాలు కూడా మృతి చెందాయి.


Next Story