తెలంగాణలోని 4 బొగ్గు గనులను.. ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రయత్నం: ఎంపీ ఉత్తమ్ కుమార్
Speech by MP Uttam Kumar Reddy in Lok Sabha Zero Hour. తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By అంజి Published on
13 Dec 2021 11:36 AM GMT

తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు బొగ్గు గనుల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పారు. కొత్తగూడెం బ్లాక్, సత్తుపల్లి బ్లాక్, శ్రావణ పల్లి బ్లాక్, కల్యాణ ఖని బ్లాక్ లను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.
దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయడం పట్ల అక్కడ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు మీద ఆధారపడి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో థర్మల్ బొగ్గు ఉత్పత్తి అవుతోందని చెప్పారు. కార్మికుల, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకం అని అన్నారు. వెంటనే కేంద్రం నాలుగు బొగ్గు ఉత్పత్తి బ్లాక్ ల ప్రైవేటీకరణ ను ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story