Telangana: గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్‌ క్వాలిటీపై స్పెషల్‌ డ్రైవ్స్‌

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల నేపథ్యంలో ఫుడ్‌ క్వాలిటీపై స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on  28 Nov 2024 7:34 AM IST
Special drive, food quality, Gurukuls , schools, Telangana

Telangana: గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్‌ క్వాలిటీపై స్పెషల్‌ డ్రైవ్స్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల నేపథ్యంలో ఫుడ్‌ క్వాలిటీపై స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్‌ ప్రిపేర్ చేసే ముందు, వంట పూర్తయ్యాక చెక్‌ చేయనున్నారు. ఇందుకోసం పాఠశాల స్థాయిలో విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్‌ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామాగ్రిని కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. సరిగా లేకుంటే వెంటనే మార్చేస్తారు.

కాగా గురుకులాల్లో ఉదయం టిఫిన్​, రెండు పూటలా భోజనం, స్నాక్స్​తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మిడ్​ డే మీల్స్​ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే బాధ్యత ఇకపై కలెక్టర్లదేనేని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులకు పెట్టే ఫుడ్​ క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి​హెచ్చరించారు. ఫుడ్​ చెకింగ్​ కోసం ప్రత్యేకంగా ఆన్​లైన్​ ఆప్​ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

అటు నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గత వారం రోజుల్లో మూడుసార్లు ఆహారం కలుషితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి బుధవారం నాడు ఆ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, బియ్యం, కూరగాయలు, తాగునీటిని పరిశీలించారు.

Next Story