బిగ్ బ్రేకింగ్‌ : రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం

Speaker Pocharam Srinivas Reddy approves Rajagopal Reddy Resignation. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి

By Medi Samrat  Published on  8 Aug 2022 6:00 AM GMT
బిగ్ బ్రేకింగ్‌ : రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. తాను నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందిస్తానని, కలిసే అవకాశం ఇవ్వకుంటే కొన్ని రోజులు వేచి చూసి నేరుగా అసెంబ్లీ కార్యదర్శితోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీనామా పత్రాన్ని పంపిస్తానని రాజగోపాల్‌రెడ్డి అంతకు ముందు చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు.

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా వెనక ఉన్న ముఖ్య కారణం.. మూడున్నరేళ్లుగా తన నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడమేనన్నారు. తన ప్రాంతం అభివృద్ధి చెందలేదని అన్నారు. తన రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. తన నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ పురపాలికల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయని.. అదే సమయంలో ప్రభుత్వం సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ పురపాలికలను అభివృద్ధి చేసిందన్నారు. ఇక్కడి ప్రజలను బస్సుల్లో అక్కడికి తీసుకెళ్లి చూపిస్తానని చెప్పారు.Next Story
Share it