హాస్టల్‌లో పాము కాటుకు గురైన విద్యార్థి
Snake bite triggers panic at Peddakodapgal SC hostel in Nizamabad. పెద్దకొడప్‌గల్ ఎస్సీ హాస్టల్‌లో కృష్ణ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు.
By Medi Samrat Published on
25 Jun 2022 8:38 AM GMT

పెద్దకొడప్‌గల్ ఎస్సీ హాస్టల్‌లో కృష్ణ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. కృష్ణ హాస్టల్‌లో ఉంటూ 6వ తరగతి చదువుతున్నాడు. కృష్ణ హాస్టల్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేందర్ కృష్ణను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం కృష్ణను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేస్తామని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.
Next Story