మహిళల కోసం తెలంగాణలో SITHA యాప్

మహిళలకు అనువైన, నైపుణ్య ఆధారిత సంపాదన అవకాశాల ద్వారా సాధికారత కల్పించడానికి రూపొందించిన SITHA యాప్ ను తెలంగాణలో ప్రారంభించారు.

By Medi Samrat
Published on : 10 Jun 2025 2:15 PM IST

మహిళల కోసం తెలంగాణలో SITHA యాప్

మహిళలకు అనువైన, నైపుణ్య ఆధారిత సంపాదన అవకాశాల ద్వారా సాధికారత కల్పించడానికి రూపొందించిన SITHA యాప్ ను తెలంగాణలో ప్రారంభించారు. మహిళలు తమ నైపుణ్యాలు, అభిరుచులు, చేతిపనుల నుండి సంపాదించడంలో సహాయపడటానికి రూపొందించారు ఈ మొబైల్ యాప్. మహిళలు నడిపించే సేవలు, ఉత్పత్తులకు విశ్వసనీయ గేట్‌వేగా పనిచేస్తుందని ఒక పత్రికా ప్రకటన తెలిపింది. 'ఉమెన్ ఫస్ట్' విధానంతో రూపొందించిన SITHA యాప్ గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన సంపాదన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది.

యాప్‌లోని కేటగిరీలలో ఆరోగ్యం, అందం & వెల్నెస్, గృహ- జీవనశైలి సేవలు, సాంకేతికత, డిజిటల్ ఎడ్యుకేషన్, విద్య-బోధన, ఈవెంట్ ప్లానింగ్, ఆర్టిసానల్ ఉత్పత్తులు, పిల్లల సంరక్షణ ఉన్నాయి. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, నటి శ్రీ లీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు www.sithaapp.comలో అందుబాటులో ఉన్నాయి.

Next Story