తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం వాటిలో ఉన్న డేటా అత్యంత కీలకంగా కానుందని తెలుస్తోంది. ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్‌ఎల్ (FLS)కు పంపారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నెంబర్లు డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్‌లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. మరోవైపు ఈ నెల 14న మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు సమాచారం అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పర్వం కొనసాగుతోంది. ఫోన్లు ట్యాంపింగ్‌కు గురైన వారిని గుర్తించి సిట్ ఇప్పటికే గుర్తించింది. ఇప్పటికే వారికి దశల వారీగా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేస్తూ వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్న విషయం తెలిసిందే.