షాలిని కిడ్నాప్ అవ్వలేదు.. పెళ్లి చేసుకుంది..!

Sircilla kidnap case takes a twist. సిరిసిల్ల యువతి షాలిని కిడ్నాప్‌ అవ్వలేదు. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని

By Medi Samrat  Published on  20 Dec 2022 12:27 PM GMT
షాలిని కిడ్నాప్ అవ్వలేదు.. పెళ్లి చేసుకుంది..!

సిరిసిల్ల యువతి షాలిని కిడ్నాప్‌ అవ్వలేదు. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు షాలిని తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది. 'జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది' అని వీడియోలో తెలిపింది.

చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని (18) అనే యువతి మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు హనుమాన్ దేవాలయానికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుండగా.. ఆలయం ముందుకి ఓ కారు వచ్చింది. శాలిని ఆ కారులోకి ఎక్కించారు. షాలిని తండ్రిని ఇద్దరు అడ్డుకున్నారు. యువతిని బలవంతంగా కారు ఎక్కించి.. అక్కడి నుండి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. యువతి కిడ్నాప్‌ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తానే స్వయంగా అతనితో వెళ్లిన్నట్లు షాలిని వీడియోలో చెప్పుకొచ్చింది.


Next Story