ప్ర‌శాంతంగా ముగిసిన ఎస్‌ఐ రాత ప‌రీక్ష‌లు

SI Mains Written exams ended Peacefully. ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తుది విడత రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి.

By Medi Samrat  Published on  9 April 2023 3:19 PM GMT
ప్ర‌శాంతంగా ముగిసిన ఎస్‌ఐ రాత ప‌రీక్ష‌లు

ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తుది విడత రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షలకు 96శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో 81 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. శనివారం రెండు పేప‌ర్లు, ఆదివారం రెండు పేపర్ల చొప్పున ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది. శనివారం జరిగిన పరీక్షలకు 81 కేంద్రాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. మొత్తం 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు హాజరైన‌ట్లు పేర్కొంది. హాజరుశాతం 95.50 నమోదైందని రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది. ఆదివారం జరిగిన పరీక్షకు 79 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 60,772 మంది అభ్యర్థులకు గాను 58,019 మంది పరీక్ష రాయగా.. 95.47శాతం హాజరు నమోదైందని పేర్కొంది. పరీక్ష సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ వెరిఫికేష‌న్‌ పూర్తి చేశామని వెల్లడించింది. ప్రిలిమినరీ రాత పరీక్ష సమయంలో తీసుకున్న డిజిటల్‌ వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్‌లతో గుర్తింపును నిర్ధాంచిట్లు పేర్కొంది. పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.


Next Story