షర్మిల సంచలన ప్రకటన.. సాయం కోసం కాల్ చేయండి
Sharmila Sensational Announcement. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని
By Medi Samrat Published on 14 May 2021 3:01 PM GMTవైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఓ వైపు పార్టీని పటిష్టంగా చేసుకోవాలని పావులు ముందుకు కదుపుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఆమె రాజకీయంగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదు. అయితే కొన్ని మంచి పనులకు మాత్రం ముందుకు వస్తూ ఉన్నారు. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.
కరోనా కారణంగా జీవిత భాగస్వాములను, కన్నబిడ్డలను, అయినవారిని కోల్పోయిన మహిళలకు ఆసరాగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కొత్తగా 'వైఎస్ఎస్ఆర్' టీమ్ ఏర్పాటు చేశారు. ఎంతో మంది కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే వాళ్ళు కరోనా బారినపడి చనిపోయారని.. కుటుంబ పెద్దదిక్కుగా నిలిచే తండ్రి/భర్త/కొడుకును కరోనాకు కోల్పోయి, కుటుంబ పోషణ చేయలేక, నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్న మహిళల కోసం తానున్నానని అన్నారు. వారి బాధను కాస్తయినా పంచుకోవాలన్ను ఉద్దేశంతో 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఏర్పాటు చేస్తున్నట్టు షర్మిల వివరించారు. మీ కాళ్లపై మీరు నిలబడడానికి, మళ్లీ మీ జీవితం సాఫీగా సాగేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాననాని అన్నారు. మన వైఎస్సార్ కుటుంబ సభ్యులే మీరంతా అని భావిస్తున్నానని. ఇకపై 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఆపదలో మీకు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా సాయం కావాల్సి వస్తే 040-48213268 ఫోన్ నెంబరుకు సమాచారం అందించాలని షర్మిల కోరారు. షర్మిల చేపట్టిన ఈ మంచి పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.