ఆ లాజిక్ మీద.. కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Sharmila lodges complaint against Telangana IT dept in TSPSC paper leak case. టీఎస్‌ పీఎస్సీ పేపర్‌ లీక్‌ ఘటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసులకు

By Medi Samrat
Published on : 5 May 2023 6:50 PM IST

ఆ లాజిక్ మీద.. కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Sharmila lodges complaint against Telangana IT dept in TSPSC paper leak case


టీఎస్‌ పీఎస్సీ పేపర్‌ లీక్‌ ఘటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎస్‌ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజిపై ప్రగతి భవన్‌ సూచనలతోనే సిట్‌ దర్యాప్తు జరుగుతోందని షర్మిల ఆరోపించారు. బాధ్యత వహించాల్సిన ఐటీ శాఖ మంత్రి (కేటీఆర్‌) తప్పించుకున్నారని.. కంప్యూటర్లకు భద్రత లేనప్పుడు ఇది పూర్తిగా ఐటీ శాఖ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఐటీ శాఖపై విచారణ కోరుతూ హైదరాబాద్‌ బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ లో మంత్రి కేటీఆర్‌ పై ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఐటీ శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ తో దర్యాప్తు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఐటీ శాఖ వైఫల్యంపై మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. సిస్టమ్స్ కు ఆడిట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెప్పాలన్నారు. కామన్ మ్యాన్ కు అంత సులభంగా ఐపీ అడ్రస్ ఎలా తెలుస్తందన్నారు. ఒక ఐటీ మంత్రిగా ఉండి పేపర్ లీక్ కేసుకు సంబంధం లేదని కేటీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు.


Next Story