తెలంగాణలో బస్సు యాత్ర చేయబోతున్న షర్మిల

Sharmila is going to go on a bus trip to Telangana. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిషనల్ డీజీపీని కలిశారు.

By Medi Samrat  Published on  2 Dec 2022 2:21 PM GMT
తెలంగాణలో బస్సు యాత్ర చేయబోతున్న షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిషనల్ డీజీపీని కలిశారు. ఇటీవల తనను అరెస్టు చేయడంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు షర్మిల. తాను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకున్నా అక్రమంగా కేసులు పెట్టారని.. డిసెంబర్ 4వ తేదీ నుండి చేపట్టే పాదయాత్రకు భద్రత కల్పించాలని షర్మిల కోరారు. అదనపు డీజీ జితేందర్‌ కు పాదయాత్రకు సంబంధించిన వివరాలను అందజేశారు వైఎస్ షర్మిల. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని ఆమె కోరారు. పాదయాత్రను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ కాపీని కూడా పోలీసులకు అందించారు. సంక్రాంతి తర్వాత తెలంగాణలో బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని.. ఎవరు ఏం చేసినా పాదయాత్రను మాత్రం ఆపేది లేదని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని.. ఈ నెల 4 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. దాడులు చేసినా.. కొట్టినా.. చంపినా బెదిరేది లేదన్నారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్‌లో దోచుకుంటున్నారు. కేసీఆర్ కొడుకు రియల్ ఎస్టేట్‌లో దోచుకుంటున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నా పోరాటం ఆగదన్నారు. బీజేపీకి దత్త పత్రికను కానే కాదని.. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి తిరిగిన కేసీఆర్‌ని బీజేపీ పెళ్లాం అనాలా..? లిక్కర్ స్కామ్, ప్రాజెక్ట్‌లలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అవినీతి బయటపెట్టాలని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా ఫ్రెండ్లీ పోలీసు కాన్సెప్ట్ ప్రకారం వ్యవహరించాలని కోరారు. తమ పాదయాత్ర ఆగిన చోట నుంచే మొదలు పెడతామని పోలీసులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.


Next Story