తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్ధానాల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కెసిఆర్ నిర్లక్ష్యం వల్లే భద్రాచలం ముంపుకు గురైందన్నారు. ముఖ్యమంత్రి అయిన కొత్తలో భద్రాచలానికి వచ్చిన కేసీఆర్.. మళ్లీ మొన్నటి వరదలకు అదికూడా వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత తీరిక చేసుకుని వచ్చారని అన్నారు. ఎవరినీ పరామర్శించరలేదని.. బాధితులతో మాట్లాడలేదని అన్నారు. కట్టమీద నిలబడి పిట్ట కథలు చెప్పి వెళ్లిపోయాడని అన్నారు.
8ఏళ్ల పాలనలో భద్రాచలం కరకట్ట పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ప్రజలు వరదలు, వర్షాల్లో మునిగి నష్టపోతే కట్టమీద నిలబడి క్లౌడ్ బరస్ట్, పోలవరం ప్రాజెక్టు వల్లే నష్టం అంటూ పిట్ట కథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలంగాణ సీఎంని విమర్శించారు. పోలవరం కారణంగానే ఈ ముప్పు వచ్చిందన్న పువ్వాడ అజయ్ ముందే ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పోలవరం వల్లే ముప్పు ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముందే ఎందుకు మాట్లాడుకోలేదని, స్వీట్లు తినిపించుకున్నప్పుడు తెలియదా అని వైఎస్ షర్మిల విమర్శించారు.