హిజ్రాలకు క్షమాపణలు చెప్పిన షర్మిల
Sharmila Apolagies to Hijras. వై.ఎస్. షర్మిలకు వ్యతిరేకంగా వరంగల్ పట్టణంలో హిజ్రాలు ఆందోళన చేస్తున్నారు
By Medi Samrat Published on 22 Feb 2023 6:03 PM IST
హిజ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వై.ఎస్. షర్మిలకు వ్యతిరేకంగా వరంగల్ పట్టణంలో హిజ్రాలు ఆందోళన చేస్తున్నారు. మహబుబాబాద్ లో తమను కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని హిజ్రాలు డిమాండ్ చేశారు. వారి ఆందోళనపై షర్మిల స్పందించారు. నా మాటలపై హిజ్రాలు బాధపడితే.. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్షమాపణ కోరుతుందని అన్నారు. వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలను ఆదుకునే బాధ్యత తనదని షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రపతి పాలనపై గవర్నర్ ను కలుస్తానని షర్మిల అన్నారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తుందని, పోలీసులు బీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తారా అంటూ షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌ను షర్మిల పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
వరంగల్ సిటీ యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర ముగిసిన తర్వాత పవన్ పై నలుగురు నిందితులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ దాడి ఘటనపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. చెక్క సుమన్, రావుల కొలను నరేందర్, గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణ అనే నలుగురిని అరెస్ట్ చేశారు.