కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

Separation of Employees According to the New Zonal Says CM KCR. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం ప్ర‌గ‌తా భ‌వ‌న్‌లో జ‌రిగింది.

By Medi Samrat  Published on  18 Dec 2021 11:43 AM GMT
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం ప్ర‌గ‌తా భ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స‌మావేశంలో.. నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఈ జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని, క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు.

వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు. ఉద్యోగులయిన భార్యాభర్తలు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తేనే ప్రశాంతంగా పనిచేయగలుగుతారని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం తెలిపారు.


Next Story