మీ ఆనందం కోసం కల్లాల్లో రైతుల కన్నీరు చూస్తున్నారు

Seethakka Fires On CM KCR. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన వ‌రి దీక్ష రెండ‌వ రోజు కొన‌సాగుతుంది.

By Medi Samrat  Published on  28 Nov 2021 3:30 PM IST
మీ ఆనందం కోసం కల్లాల్లో రైతుల కన్నీరు చూస్తున్నారు

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన వ‌రి దీక్ష రెండ‌వ రోజు కొన‌సాగుతుంది. దీక్ష‌కు హాజ‌రైన కాంగ్రెస్ నాయ‌కురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై నిప్పులు చెరిగారు. రైతు పోరాటం ప్ర‌ధాని మోదీ మెడలు వంచిందని సీత‌క్క అన్నారు. రైతుల పోరాటానికి సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు.. క‌నీసం వారిని పట్టించుకోలేదని విమ‌ర్శించారు. రైతు మరణాలకు అసెంబ్లీలో కనీసం సంతాపం కూడా తెలుపలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మీ ఆనందం కోసం కల్లాల్లో రైతుల కన్నీరు చూస్తున్నార‌ని విమ‌ర్శించారు సీత‌క్క‌. మిల్లర్లను ఎందుకు మందలించడం లేదని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై వరి వద్దంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం కరోనా చావులు, రైతుల చావు లెక్కలు దాచి పెడుతోందని ఫైర్ అయ్యారు. ఓవైసీ, మోదీ వేరు వేరు కాదని.. మోదీ వ్యతిరేక ఓట్లను ఓవైసీ చీల్చి బీజేపీకి సహాయం చేస్తున్నారని సీత‌క్క అన్నారు. రైతుల కోసం ఎంతటి త్యాగానికైనా కాంగ్రెస్ సిద్ధమ‌ని ఆమె తెలిపారు.


Next Story