హైదరాబాద్‌లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకట రమణ సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలాన్ కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి చేరే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిన్న తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది హార్ట్ స్ట్రోక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు.