అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శబరిమలకు సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు

SCR to run Sabarimala Special trains between Secunderabad, Kollam. హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్-కొల్లాం మధ్య శబరిమల

By అంజి  Published on  10 Nov 2022 8:17 PM IST
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శబరిమలకు సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్-కొల్లాం మధ్య శబరిమల ప్రత్యేక రైళ్లను నడపనుంది. 07117 నెంబర్‌ గల శబరిమల ప్రత్యేక రైలు నవంబర్ 20, డిసెంబర్ 4, 18, 2023, జనవరి 8వ తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లాం వెళ్లనుంది. ఈ రైలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

07118 నెంబర్‌ గల శబరిమల ప్రత్యేక రైలు.. నవంబర్ 22, డిసెంబర్ 6, 20, 2023 జనవరి 10వ తేదీల్లో కొల్లాం నుంచి సికింద్రాబాద్‌ రానుంది. ఈ రైలు మంగళవారం రాత్రి 11.20 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

వీటితో పాటు ఇతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - కొల్లాం (07121) నవంబర్ 27, డిసెంబర్ 11, 25, 2023 జనవరి 1, 15 వ తేదీలలో నడుస్తుంది. అలాగే కొల్లాం - సికింద్రాబాద్ (07122) నవంబర్ 29, డిసెంబర్ 13, 27, 2023 జనవరి 3, 17 తేదీలలో నడుస్తుంది.

అదేవిధంగా సికింద్రాబాద్ - కొల్లాం (07123) రైలు నవంబర్ 21, 28 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి మొదలవుతుంది. నవంబర్ 23, 30 తేదీల్లో కొల్లాం - సికింద్రాబాద్ (07124) రైలు కొట్టాం నుంచి మొదలవుతుంది. నవంబర్ 20, 27 తేదీల్లో సికింద్రాబాద్ – కొట్టాయం (07125), నవంబర్ 21, 28 తేదీల్లో కొట్టాయం – సికింద్రాబాద్ (07126) మధ్య ప్రయాణించవచ్చు. ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

సికింద్రాబాద్-కొట్టాం రూట్‌లో నడిచే శబరిమల ప్రత్యేక రైళ్లు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప , రాజంపేట, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పొడనూర్, పాలక్కాడ్, షొరనూర్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.


Next Story