తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
Schools Start From Feb 1st In Telangana. తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
By Medi Samrat
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. దాదాపు పది నెలల పాటు మూత పడిన విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడటంతో్ విద్యార్థులకు ఇబ్బందులకు గురయ్యారు. గత ఏడాది పరీక్షలు రాయకుండానే పై తరతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి 9 నుంచి అపై తరగతులు విద్యార్థులకు విద్యాబోధనకు అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు వృత్తి విద్య కళాశాలలన్నీ తెరుచుకోనున్నాయి. ఇప్పటి వరు 70 శాతానికిపైగా తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నాయి.
అయితే కోవిడ్ నిబంధనల ప్రకారమే. విద్యాసంస్థలను కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. అందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాలలు, కళాశాలల వద్ద తప్పకుండా శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది.
తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తప్పనిసరి..
9,10వ తరగతి విద్యార్థులే క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతి పత్రం తప్పనిసరి వారు అంగీకరిస్తేనే విద్యార్థులు పాఠశాలలకు హాజరువుతారు. అలాగే ఇంటర్మీడియేట్ తరగతులు కూడా నిర్వహించనున్నారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో రోజుకు 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
తరగతి వేళలు..
*పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు
*హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 వరకు
*జూనియర్ కళాశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు
*డిగ్రీ ఆపై స్థాయి కళాశాలలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు