జులై 1 నుంచి స్కూళ్లు ఓపెన్.. కష్టమే

Schools Reopen In Telangana. కరోనా సెకండ్ వేవ్ తగ్గిందని అంచనాకు వచ్చేశాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా తెలంగాణ

By Medi Samrat  Published on  26 Jun 2021 1:34 PM GMT
జులై 1 నుంచి స్కూళ్లు ఓపెన్.. కష్టమే

కరోనా సెకండ్ వేవ్ తగ్గిందని అంచనాకు వచ్చేశాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అన్నదే లేకుండా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక పాఠశాలలను కూడా మొదలు పెట్టాలని భావించారు. జులై 1 నుంచి స్కూళ్లను తెరచాలని భావించారు. అయితే విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడంపై తెలంగాణ సర్కారు వెనక్కు తగ్గింది. క‌రోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉంద‌న్న వార్తల వేళ పాఠ‌శాల‌ల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం మ‌రోసారి సమీక్ష జరిపి పునరాలోచించింది. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ను తిరిగి ప్రారంభించే విష‌యంలో ఆన్ లైన్ క్లాసులకే ప్రాధాన్యం ఇచ్చింది.

జులై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని.. 50 శాతం ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి నిర్దేశించారు. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. తాజా నిర్ణయం ప్రకారం 9, 10 తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన జరగనుంది. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు పాఠశాలకు విధులకు హాజరయ్యేలా 50 మందితో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. కరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వేయిదా వేయాలని, ఆన్ లైన్‌లోనే విద్యా బోధన కొనసాగించాలని సీఎంను కోరారు.


Next Story
Share it