స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా, 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం

By అంజి  Published on  7 March 2024 6:27 AM IST
Schools , Telugu state, holidays, Telangana, AP

స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా, 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఖుషీ అవుతున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవులు రానున్నాయి. మార్చి 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలోమాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు.

Next Story