Breaking : తెలంగాణలో సోమవారం వరకు పాఠశాలలు బంద్‌

Schools in Telangana to remain shut till Monday. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

By Medi Samrat
Published on : 13 July 2022 3:34 PM IST

Breaking : తెలంగాణలో సోమవారం వరకు పాఠశాలలు బంద్‌

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న దృష్ట్యా, రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ వారంలో మరో మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడతాయి. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జులై 11 నుంచి 13 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.







Next Story