Telangana: రెండు రోజులు సెలవులు

రంజాన్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది.

By అంజి
Published on : 28 March 2025 12:36 PM IST

Schools, Telangana, holidays, Eid-ul-Fitr

Telangana: రెండు రోజులు సెలవులు

రంజాన్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లోని 10వ నెల షవ్వాల్ మొదటి రోజున జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ కోసం ప్రభుత్వం పాఠశాలలు సెలవులు ప్రకటించింది. ఈ ప్రకటన తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక క్యాలెండర్‌లో ప్రకటించిన సెలవులకు అనుగుణంగా ఉంది.

తెలంగాణ క్యాలెండర్‌ ప్రకారం మార్చి 31న ఈద్‌ ఉల్‌ ఫితర్‌తో పాటు ఆ తర్వాత రోజు ఏప్రిల్‌ 1న కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జమాతుల్‌- విదా, షబ్‌-ఎ- ఖాదర్‌ సందర్భంగా ఆప్షనల్‌ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. విద్యాసంస్థలు ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభమవుతాయి. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.

నెలవంక దర్శనం

ఈద్-ఉల్-ఫితర్ వేడుక నెలవంక దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. మార్చి 30న ఈద్ కనిపిస్తే, మార్చి 31న ఈద్ జరుపుకుంటారు. లేకుంటే, ఏప్రిల్ 1న జరుపుకుంటారు. షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. మసీదులు, ఈద్గాలలో నమాజ్ చేసిన తర్వాత వేడుకలు ప్రారంభమవుతాయి.

చంద్రుని దర్శనం ఆధారంగా ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి, ఈద్-ఉల్-ఫితర్ తేదీని నిర్ణయించడానికి సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-డెక్కన్ సెంట్రల్ రూట్-ఎ-హిలాల్ కమిటీ, లేదా చంద్ర దర్శన కమిటీ మార్చి 30న సమావేశమవుతుంది. ఈద్-ఉల్-ఫితర్ తేదీతో సంబంధం లేకుండా, పాఠశాలలు తెలంగాణ క్యాలెండర్‌ను అనుసరించి మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో సెలవులు ప్రకటించాయి.

Next Story