గ్రామంలోని సమస్యలపైన ప్రశ్నించినందుకు సర్పంచ్ రెచ్చిపోయాడు. అధికారమదం చూపిస్తూ సమస్యలపై ప్రశ్నించిన సామాన్యునికి బూటుకాలితో సమాధానం ఇచ్చాడు. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాళ్లోకెళితే.. దామస్తాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్వక్తి గ్రామ పంచాయతీలో గ్రామసమస్యలు చాలా వున్నాయి. నీటి సమస్య, డ్రైనేజీ సమస్య మీద దృష్టి సారించాలని సర్పంచ్‌ను అడిగాడు.
అయితే.. రెండు రోజుల క్రితం ఓ గొడవ నిమిత్తం పంచాయితీ పెట్టిన సర్పంచ్.. పిట్టల శ్రీనివాస్ పై ప్రతాపం చూపించాడు. నోటికి పని చెబుతూ తన్నడం మొదలుపెట్టాడు. సర్పంచ్ చర్యతో కంగుతిన్న పిట్టల శ్రీనివాస్ గ్రామ సమస్యలపై అడగడానికి వస్తే దాడి చేశారని వాపోయాడు. జరిగిన ఘటనపై శ్రీనివాస్ మార్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై మార్పల్లి ఎస్ఐ వెంకట శ్రీనును వివరణ కోరగా.. శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వివరాలు పరిశీలించి కేసు పైల్ చేస్తామని అన్నారు.