15 రోజుల్లో రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా: జగ్గారెడ్డి

Sangareddy MLA Jaggareddy new comments. సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే విషయంలో కాస్తా

By అంజి  Published on  20 Feb 2022 1:44 PM IST
15 రోజుల్లో రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా: జగ్గారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే విషయంలో కాస్తా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తన రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అయితే 15 రోజుల్లో రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవట్లేదని, చాయ్‌ కప్పులో తుపాన్‌ వచ్చినట్లు అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారని అన్నారు.

అసలు సమస్య ఏమిటో తెలుసుకోవట్లేదన్నారు. పార్టీలో ఉన్న పలువురు నాయకులు తనకు రెండు రోజులుగా పార్టీని విడొద్దని సర్ది చెబుతున్నారని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను కలిస్తే తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటానని చెప్పారు. ఢిల్లీ అపాయింట్‌మెంట్‌ వస్తే కలుస్తానని, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిసేందుకు తమ పార్టీ సీనియర్లు నాయకులు ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Next Story