డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్‌ సెక్రటరీ

నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

By Knakam Karthik
Published on : 13 May 2025 1:43 PM IST

Telangana, Hyderabad News, Deputy Cm Bhatti Vikramarka, Sandeep Kumar Sultania

డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్‌ సెక్రటరీ

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాను నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విషెస్ తెలిపారు.

కాగా 1998 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ సుల్తానియా బిహార్ రాష్ట్రానికి చెందిన వారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా అకౌంటెన్సీ విభాగంలో ఆయన గ్రాడ్యుయేట్. మొదట ఆయన తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్థిక, రవాణా, సహకార సంస్థలు, పర్యాటక రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, భూ రెవెన్యూ నిర్వహణ, పట్టణాభివృద్ధిలో అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న ఆయన తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమతులయ్యారు.

Next Story