ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది. మేడారంలో రేపు సమ్మక్క సారలమ్మ దర్శనాలు రేపు నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘ అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. బుధవారం గద్దెల ప్రాంగణంలో గోవిందా రాజు, పగిడిద్ద రాజుల ప్రతిష్టాపనతో పాటు విస్తరణ పనులు ఉన్నందున బుధవారం భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
కాగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తమ దర్శనాలను ఒక రోజు వాయిదా వేసుకోవాలని కోరారు. మరో వైపు మహా జాతరకు సమయం సమీపిస్తుండటంతో మేడారం అభివృద్ధి పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమ్మక్కసారలమ్మల గద్దెల వద్ద ఏర్పాటు చేసిన ధ్వజ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగానే రేపు గోవిందరాజు, పగిడిగిద్దరాజుల గద్దె ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది.