ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు సురక్షిత చికిత్స: మంత్రి హరీశ్‌రావు

Safe treatment facilities for pregnant women in govt hospitals: Minister Harish Rao. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన లేదా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు భయాందోళనలకు గురికావద్దని

By అంజి  Published on  23 Jan 2022 2:25 PM IST
ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు సురక్షిత చికిత్స: మంత్రి హరీశ్‌రావు

కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన లేదా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు భయాందోళనలకు గురికావద్దని ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి హరీష్ రావు పిలుపునిచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని గర్భిణులకు సురక్షితమైన వైద్యం అందించి ప్రసవాలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ కాలనీలో ఆదివారం ఫీవర్‌ సర్వే పురోగతిని పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములు వసూలు చేయొద్దని సూచించారు.

రోగులకు చేరువ కావాలనే లక్ష్యంతో ఫీవర్‌ సర్వే చేపట్టామని, తొలి రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 29.20 లక్షల కుటుంబాలకు ఫీవర్‌ సర్వే నిర్వహించామని, వారికి లక్ష హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌లను అందజేశామని రావు తెలిపారు. పలువురు వివిధ లక్షణాలతో బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56,000 కోవిడ్-19 పడకలను సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణలో కేసులు తగ్గుతాయని ఆరోగ్య మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రజలు తరచుగా చేతులు కడుక్కోవడమే కాకుండా మాస్క్‌లు ధరించాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పటాన్‌చెరు గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ వీ సింధు ఆదర్శరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story