అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే సబిత సీరియస్
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
By Medi Samrat Published on 31 July 2024 8:15 AM GMTఅసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా నేతల పార్టీ మార్పులపై చర్చ మొదలైంది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చర్చ వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని అన్నారు. సబితా ఇంద్రారెడ్డిని సబితక్కా అని పిలుస్తూ “ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టారు. నువ్వు కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని సబితక్క నాకు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి ఆమె మాత్రం బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. నేను చెప్పే మాట నిజమా? కాదా? అని సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి అని సీఎం రేవంత్ కొత్త గవర్నర్‌కు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.
దీనిపై ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి.. “కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూపిస్తూ.. అక్కడ ఉన్న వారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరారో చర్చిద్దాం. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? నేను ఏం మోసం చేశాను? ఎవరిని ముంచాను? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది నేనే. ఆ పార్టీలోకి వస్తే నువ్వు సీఎం అవుతావు.. నీకు భవిష్యత్తు ఉందని చెప్పాను. అలాంటి నన్ను. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే టార్గెట్ చేశారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే స్పీకర్ జోక్యం చేసుకొని సభా నాయకుడిని అగౌరవ పరుస్తున్నారని అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సబిత ఏయే పదవుల్లో కొనసాగారో ప్రస్తావించారు. దీంతో ఫీలైన ఎమ్మెల్యే సబిత ఏడ్చేశారు.