రైతులకు కేసీఆర్ స‌ర్కార్‌ శుభవార్త.. జూన్‌ 15నుంచి రైతుబంధు సాయం

Rythubhandhu Assistance For Telangana Farmers from June15. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ‌చ్చే వ‌ర్షాకాలం సాగుకు

By Medi Samrat  Published on  29 May 2021 3:13 PM GMT
రైతులకు కేసీఆర్ స‌ర్కార్‌ శుభవార్త.. జూన్‌ 15నుంచి రైతుబంధు సాయం

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ‌చ్చే వ‌ర్షాకాలం సాగుకు సంబంధించిన రైతుబంధు సాయం జూన్15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రైతుబంధు సాయంపై నిర్ణ‌యం తీసుకున్నారు.

జూన్‌ 10ని కట్టాఫ్‌ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమచేయ‌డం పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్‌-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది.


Next Story
Share it