రాష్ట్ర సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం సమావేశమయ్యింది. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు పడ్తున్న ఇబ్బందులను కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలు సెంటర్ల వద్ద రైతులకు పక్కా రసీదులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడ్తున్నట్లు వివరించారు. ఇక తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపిస్తున్నారు. అయితే రైస్ మిల్లుల్లో ధాన్యం దించే వరకు రైతులను బాధ్యులుగా చేయడం సరైంది కాదన్నారు. చాలా ప్రాంతాల నుండి రైతులు ఈ విషయంపై రైతు కమిషన్ కు ఫిర్యాదులు చేసినట్లుగా మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసి ఇలాంటివి మరో సారి జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.