చూస్తుండ‌గానే త‌గ‌ల‌బ‌డిపోయిన సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు

RTC Super Luxury Bus Burnt On Road. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా

By Medi Samrat  Published on  23 July 2021 12:09 PM GMT
చూస్తుండ‌గానే త‌గ‌ల‌బ‌డిపోయిన సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. వివ‌రాళ్లోకెళితే.. ప్ర‌యాణికుల‌తో హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు.. స్టేషన్ ఘనపూర్ వ‌ద్ద‌కు రాగానే మంట‌లు చెల‌రేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఘటనలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు ప్రయాణికులు, డ్రైవర్ తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 22 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న జ‌నాలు, చుట్టు ప్ర‌క్క‌న‌ ప్ర‌జ‌లు బ‌స్సు ద‌గ్ధ‌మ‌వుతున్న‌ దృశ్యాల‌ను త‌మ సెల్ ఫోన్‌ల‌లో బంధించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.Next Story
Share it