Video: ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు కొట్టేసిన ఆర్టీసీ డ్రైవర్‌

ప్రయాణికురాలి బంగారు ఆభరణాలను దొంగిలిస్తూ పట్టుబడిన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను డ్యూటీ నుంచి తొలగించారు ఆర్టీసీ అధికారులు.

By అంజి  Published on  13 Nov 2024 5:15 AM GMT
RTC driver, passenger, gold jewellery, Telangana, TGSRTC

Video: ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు కొట్టేసిన ఆర్టీసీ డ్రైవర్‌

ప్రయాణికురాలి బంగారు ఆభరణాలను దొంగిలిస్తూ పట్టుబడిన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను డ్యూటీ నుంచి తొలగించారు ఆర్టీసీ అధికారులు. వరంగల్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్లే రూట్‌లో పనిచేస్తున్న ఓ బస్సు డ్రైవర్‌ ప్రయాణికురాలి బ్యాగులోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ పట్టుబడడంతో.. అతడిని అధికారులు విధుల నుంచి తప్పించారు. ఆర్‌టిసి ప్రైవేట్ డ్రైవర్.. ప్రయాణికురాలి బ్యాగ్‌లోంచి నగలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఓ ప్రయాణికుడు వీడియోను చిత్రీకరించాడు.

ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న మహిళ, తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. అయితే ఈ క్రమంలోనే ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్‌గా నొక్కేశాడు. అయితే, ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్‌ ఫోన్‌లో రికార్ట్ చేయడంతో బండారం బయటపడింది.

ఈ ఘటనను టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ధృవీకరించారు. ''అతను ప్రైవేట్ కిరాయి బస్సు డ్రైవర్. ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. డ్రైవర్ చర్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో, దుష్ప్రవర్తనపై అధికారులను అప్రమత్తం చేయడంతో వేగవంతమైన చర్య జరిగింది'' అని తెలిపారు. కాగా ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. డ్రైవర్‌కు ఇదే పాడు బుద్ధి అని చర్చించుకుంటున్నారు.

Next Story