తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ క్లారిటీ.!

RTC Bus charges will increase says chairman‌ bajireddy govardhan. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30

By అంజి  Published on  1 Dec 2021 7:56 AM GMT
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ క్లారిటీ.!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు మేర ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ చెప్పారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఛార్జీల పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత నెలలోనే ఛార్జీల పెంపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించామని చెప్పారు. దూరం ఎక్కువ గల రూట్‌లలో బస్సులు నడిపితే లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.

పెరిగిన డీజిల్‌ ధరలు ఆర్టీసీ భారంగా మారిందని చెప్పారు. రోజుకు ఆర్టీసీ బస్సుల్లో 6.8 లక్షల లీటర్ల డీజిల్‌ను వాడాల్సి వస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. మరో వైపు 1400 వందల బస్సులు పూర్తిగా పాడయ్యాయని చెప్పారు. వాటి స్థానంలో కొత్త బస్సులను కొనాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను చివరిసారిగా 2019 డిసెంబర్‌ 1వ తేదీన పెంచారు. ఛార్జీల పెంపుతో ఆర్టీసీకి సుమారు రూ.800 కోట్ల అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడానికి ముఖ్యకారణం డీజిల్‌ ధర పెంపేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలు బస్‌ డిపోలను ఎత్తివేస్తున్నారన్న వార్తలను బాజిరెడ్డి గోవర్ధన్‌ ఖండించారు.

Next Story
Share it