రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!

ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం నాడు రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది

By Medi Samrat  Published on  4 Oct 2024 8:30 PM IST
రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!

ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం నాడు రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది. జిల్లాలోని నాలుగు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లలో స్మగ్లర్లపై శాఖ చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎక్సైజ్ అధికారులు బ్యాగుల్లో నింపిన నిషిద్ధ వస్తువులను జిల్లాలోని ఐఎన్‌టీసీ కాంప్లెక్స్‌కు తీసుకొచ్చి దహనం చేశారు.

తెలంగాణలో గంజాయి స్మగ్లర్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి వద్ద 20 వేల విలువగల గంజాయి లభించినట్లు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తూప్రాన్ పట్టణంలో అక్రమ గంజాయి విక్రయాలు జరిపే వ్యక్తుల పైన నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ పట్టణంలోని శివాజీ నగర్ లో గల 6-76 ఇంట్లో నివాసం ఉంటున్న సంగ నర్సింలు అనే వ్యక్తి అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేయగా అతని వద్ద 260 గ్రాములు కలిగిన 40 ప్యాకెట్స్ లభించాయి. దీని విలువ సుమారు 20000 వేల వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story