ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌

RS Praveen Kumar Tested For Covid Positive. మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ నేత‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా

By Medi Samrat
Published on : 10 Aug 2021 10:59 AM

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్‌ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అంటూ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలావుంటే.. ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆదివారం నల్లగొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో భారీ సభ నిర్వహించారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరుతో జ‌రిగిన స‌మావేశంలో బీఎస్పీ నేషనల్‌ కోఆర్డినేటర్‌ రామ్‌జీ గౌతమ్‌ సమక్షంలో ప్రవీణ్‌కుమార్‌ బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లో చేరారు.


Next Story