అంద‌రినీ దోషులుగా చేరుస్తామంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవితతో భేటీ అనంత‌రం ఆర్ఎస్పీ

ఎమ్మెల్సీ కవిత చాలా దైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

By Medi Samrat  Published on  17 May 2024 3:11 PM IST
అంద‌రినీ దోషులుగా చేరుస్తామంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవితతో భేటీ అనంత‌రం ఆర్ఎస్పీ

ఎమ్మెల్సీ కవిత చాలా దైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాల్క సుమన్ తో క‌లిసి తీహార్ జైల్లో కల్వకుంట్ల కవితతో భేటీ అయిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. క‌విత నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని ఆరోపించారు. లాయర్ కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేశారంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం అవుతుందన్నారు. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయి. అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ప్ర‌శ్నించారు.

రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారని ప్ర‌శ్నించారు. కవిత దగ్గర ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు.. పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుంది? అని అడిగారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారని ప్ర‌శ్నించారు. వాళ్ళ పేర్లు, వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీలో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోందన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీని బీజేపీ వాడుకుంటుందన్నారు.

Next Story