ఐపీఎస్‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆరేళ్ల స‌ర్వీస్ ఉన్నా.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌

RS Praveen Kumar Resigned For IPS. ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వాలంట‌రీ రిటైర్మెంట్

By Medi Samrat  Published on  19 July 2021 11:56 AM GMT
ఐపీఎస్‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆరేళ్ల స‌ర్వీస్ ఉన్నా.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికి ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. ఈ మేర‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ‌ లేఖ‌ను ట్వీట్ చేశారు. రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఈమెయిల్ ద్వారా తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా.. గ‌త 26 ఏళ్ళుగా స‌హ‌క‌రించిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌.. ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇంకా ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ.. ప్ర‌వీణ్ కుమార్ వీఆర్‌ఎస్‌ కోరడం ప్ర‌స్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Next Story
Share it