ఆంధ్ర పాలకుల స్క్రిప్ట్‌ను తప్పుల్లేకుండా చదివార‌ని తెలిసిపోతుంది : ఆర్ఎస్పీ

మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగ‌ట్టారు.

By Kalasani Durgapraveen  Published on  9 Dec 2024 12:33 PM IST
ఆంధ్ర పాలకుల స్క్రిప్ట్‌ను తప్పుల్లేకుండా చదివార‌ని తెలిసిపోతుంది : ఆర్ఎస్పీ

మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగ‌ట్టారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న.. ఈ రోజు ప్రతిపక్షాలను బంధించి, వారి గొంతు నొక్కి అసెంబ్లీలో ఏక పక్షంగా చరిత్రలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రశస్తిపై తెలంగాణ సీయం గారు మీరు చేసిన ప్రసంగంలో కేసీఆర్ గారి వీరోచిత పోరాట ప్రస్తావనే లేకపోవడం, సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతున్నది. మీరు ఈరోజు ఆంధ్ర పాలకుల స్క్రిప్ట్ ను తప్పుల్లేకుండా చదివిండని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.

సూటిగా చెప్పండి.. నవంబర్ 29న కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికి సిద్ధం కాకపోతే.. డిసెంబర్ 9న నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుండేనా.? మీ ప్రసంగంలో ఈ రోజైనా చివర్లో ‘జై తెలంగాణ’ అనే ధైర్యం, ద‌మ్ము లేని మీరు ఈ రోజు సాయంత్రం మళ్లీ అందరినీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి అంటున్నరు.! ఏ మొఖం పెట్టుకోని రావాలె తెలంగాణ ప్రజలు.? మీకు అదానీ-ఆమ్దానీలే ముఖ్యం. తెలంగాణ సంస్కృతి ముఖ్యం కాదు అని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ట్వీట్ వైర‌ల్ అవుతుంది.

Next Story