తెలంగాణలో రోడ్లకు మహర్దశ రానుంది. హ్యామ్ విధానంలో మొదటి విడత రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంచి రోడ్డు అభివృద్ధికి చిహ్నాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి మెరుగైన బీటీ రోడ్లు నిర్మిస్తాం. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి నాణ్యమైన రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం. హ్యామ్ విధానంలో జిల్లాల వారీగా మొదటి విడతలో 17 ప్యాకేజీల్లో 373 రోడ్లు నిర్మాణం చేస్తాం. 5190.25 కిలో మీటర్ల మేర రూ.6478.33 కోట్లతో టెండర్లు పిలుస్తాం..అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.