వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
Road Accident in Huzurabad two dead.కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును
By తోట వంశీ కుమార్ Published on
8 March 2022 2:18 PM GMT

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ కు చెందిన ఓ కుటుంబం కారులో వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరిగి వస్తుండగా.. హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story