చిరుతతో నోముల భగత్ వాకింగ్.. ఇదే హాట్ టాపిక్

RGV Comments On Nomula Bhagath. రామ్ గోపాల్ వర్మ ఏ విషయాన్నైనా సామాజిక మాధ్యమాల్లో చెప్పారంటే అది వైరల్ అవ్వక తప్పదు

By Medi Samrat  Published on  3 April 2021 11:05 AM IST
చిరుతతో నోముల భగత్ వాకింగ్.. ఇదే హాట్ టాపిక్

రామ్ గోపాల్ వర్మ ఏ విషయాన్నైనా సామాజిక మాధ్యమాల్లో చెప్పారంటే అది వైరల్ అవ్వక తప్పదు. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కేనని వర్మ అన్నారు. ఇంతకూ అలా చెప్పడానికి కారణం ఏమిటంటే.. చిరుతపులితో నోముల భగత్‌ కలిసి నడిచిన వీడియోనే..! వర్మ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను సింహం, పులితో పోల్చిన రాంగోపాల్‌ వర్మ ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళ్లిన నోముల భగత్‌ను ఇష్టపడుతున్నట్లు తెలిపారు.

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ‌య్య కొడుకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ ట్వీట్ చేశారు. "వామ్మో... కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని'' అని వర్మ ట్వీట్ చేశారు.

చిరుతపులితో నోముల భగత్ నిజంగానే వెళ్లారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీడియోని గమనించిన చాలా మంది నెటిజన్లు అది గ్రాఫిక్ కాదనీ, నిజమైన వీడియోనే అని అంటున్నారు. విదేశాలలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని చెప్పారు.


Next Story