తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 19 నుంచి స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరుకానున్నారు. తిరిగి ఫిబ్రవరి 1న రాష్ట్రానికి చేరుకోనున్నారు. పెట్టుబడులు ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ విజన్-2047ను పెట్టుబడుదారులకు వివరించనున్నారు.
దావోస్‌లో జరిగే ‘ప్రపంచ ఆర్థిక సదస్సు-2026’ లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో తెలంగాణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సదుపాయాలను వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రైపోర్ట్, బుల్లెట్ ట్రైన్, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల వంటి అంశాలను తెలియజేయనున్నారు.