గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను మార్చి, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్ ఉందని, రాబోయే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మిగితా నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు.