మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  7 Oct 2023 3:15 PM IST
మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారారని లేఖ‌లో దుయ్య‌బ‌ట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచలేదు సరికదా.. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వంట కార్మికులకు ఆర్థిక భారంతోపాటు పనిభారం పెంచారని ఎండ‌గ‌ట్టారు.

చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవని.. చెట్ల కింద వంటలు కొనసాగుతున్న పరిస్థితి.. దీనివల్ల అక్కడక్కడ మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థకు గురైన సందర్భాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జీవో 8 ప్రకారం.. పెరిగిన వేతనాలను ఏరియర్స్‌ తో సహా వెంటనే చెల్లించాలన్న వారి డిమాండ్లను పట్టించుకోలేదని.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉంటే.. ఆ పరిస్థితులపై ఒక్క సారి కూడా మీరు సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతోపాటు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story