రాజేంద్రా.. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On Etela Rajender. ఈటెల‌కు స‌వాల్ విసిరిన‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్

By Medi Samrat  Published on  22 April 2023 1:56 PM GMT
రాజేంద్రా.. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు : రేవంత్ రెడ్డి

Revanth Reddy


ఈటెల‌కు స‌వాల్ విసిరిన‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్ గా బాగ్యాలక్మి దేవాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు పెద్దఎత్తున నాయకులు తరలివెళ్లారు. అనంత‌రం చార్మినార్ బాగ్యలక్మి దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. అనంత‌రం అమ్మవారి శాలువా కప్పి రేవంత్ ను ఆశీర్వదించారు పూజారి. అనంత‌రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి సేవలను గుర్తించి మునుగోడు ఎన్నికల్లో స్రవంతికి పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. ఎన్నికల సమయంలో 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క రూపాయి, చుక్క మందు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని యాదగిరి గుట్టలో ప్రమాణం చేయాలని స్రవంతి సవాల్ విసిరింది. 25 వేల మంది ఓటర్లు స్రవంతి పక్కన నిలబడ్డారని తెలిపారు.

ఈటెల రాజేందర్ వ్యవహార శైలి నేను గమనిస్తున్న.. కేసీఆర్ కాంగ్రెస్‌కు 25కోట్లు సాయం చేశారని ఈటెల ఆరోపించారు. ఇది ఆరోపణ కాదు.. ఆధారాలు లేవని ఈటెల అన్నారు. ఆధారాలు లేనపుడు అందరూ దేవుడిని నమ్ముతారు. కేసీఆర్ తో ఎలాంటి లాలూచీ లేదు.. రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే.. నా కుటుంబం సర్వ నాశనమైపోతుందని అన్నారు. ఇది అమ్మవారి కండువా సాక్షిగా చేస్తున్న‌ ప్రమాణమ‌ని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నన్నాళ్లు 16 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాన‌న్నారు. కేసీఆర్ ను ఎదుర్కొని నిటారుగా నిలబడ్డా రాజేంద్రా.. నోటీసులు ఇవ్వగానే ఎవరికో నేను లొంగిపోలేదు రాజేంద్రా.. నాపై, పార్టీపై ఆరోపణలు చేస్తావా.. ఇదేనా కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్ ఇస్తున్న గౌరవం అంటూ నిల‌దీశారు. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా అని ప్ర‌శ్నించారు. నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కదా రాజేంద్రా.. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు.. ఆలోచించి మాట్లాడు.. నీపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన రాజేంద్ర.. ఇలాంటి ఆరోపణలు మంచివి కాదని అన్నారు.

ఇదేనా కేసీఆర్ తో కొట్లాడేవారికి ఇచ్చే గౌరవం.. కొట్లాడటానికే మా జీవితాలు ధారేపోస్తున్నాం.. నన్ను అమ్ముడుపోయారని అంటావా? అంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరని స్ప‌ష్టం చేశారు. ఇది చిల్లర రాజకీయం కాదు.. పోరాటం అని పేర్కొన్నారు. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదని హెచ్చ‌రించారు. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా.. నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమేన‌ని అన్నారు.


Next Story