కేసీఆర్‌ను మొదట కలిస్తే.. బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదు

Revanth Reddy Fire On CM KCR. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి టీఆర్ఎస్, బీజేపీ చిల్లర రాజకీయాలకు

By Medi Samrat  Published on  2 July 2022 11:39 AM GMT
కేసీఆర్‌ను మొదట కలిస్తే.. బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదు

వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి టీఆర్ఎస్, బీజేపీ చిల్లర రాజకీయాలకు తెర లేపారని.. కల్లు కంపౌండ్ లో కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ , రైల్వే కోచ్ తదితర వాటిని కాంగ్రెస్ చట్టబద్ధంగా హామీ ఇచ్చిందని.. గత ఎనిమిదేళ్లుగా ఈ హామీల విషయంలో కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే.. 16 నెలలు అటువైపు కేసీఆర్ కన్నెత్తి చూడలేదని విమ‌ర్శించారు. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై ప్రశ్నించలేదు. పునర్విభజన చట్టం.. మోదీ ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో కేసీఆర్ కు అవకాశం ఉన్న వదిలేశారని.. సీఎం కేసీఆర్ ఛీప్ గా వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించారు.

సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీ లతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని మండిప‌డ్డారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గ్యాస్, డీజిల్ , పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్న అవకాశాలను జారవిడిచారని దుయ్య‌బ‌ట్టారు. సికింద్రాబాద్ లో అగ్నిపథ్ విషయంలో జరిగిన కాల్పులు ఎవరు చేశారనేది స్పష్టం చేయలేదని.. లోపభూయిష్టంగా ఉన్న అగ్నిపథ్ పథకంపై మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు.

ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా టీఆర్ఎస్ జెండా లు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని ప్ర‌శ్నించారు. నిన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కట్టిన వాటిని తొలగిస్తే.. ఈ రోజు మళ్లీ కట్టారని.. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతమ‌ని నిల‌దీశారు.

తెలంగాణ ఏర్పాటును శంకించిన మోదీకి.. ఈ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదని రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉంటేనే బీజేపీ తెలంగాణ కు చిల్లిగవ్వ ఇవ్వ‌లేదు.. వీళ్లు ముఖ్యమంత్రి అయినా చేసేది ఏం లేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ చతురతతో వ్యవహరించాలని.. ప్లెక్సీల పంచాయతీ.. చిల్లర పంచాయతీల‌ను పక్కన పెట్టాలని అన్నారు. కేసీఆర్ ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదని అన్నారు.

తప్పును తప్పు అని ప్రశ్నించిన మా నేతలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా అని ప్ర‌శ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే.. కేసీఆర్, కేటీఆర్ ల వీపులకు కాంగ్రెస్ జెండా లు కడుతామ‌ని హెచ్చ‌రించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద మరోసారి చిల్లర రాజకీయాలు చేస్తే.. జెండాలు టీఆర్ఎస్ నేతల మెడలకు కడుతామ‌ని అన్నారు.


Next Story
Share it