కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న తూర్పు గోదావరి జిల్లా వాసులు

Residents of East Godavari convey wishes in a novel way. తెలంగాణ ర‌థ‌సార‌ది కేసీఆర్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.

By Medi Samrat
Published on : 17 Feb 2021 8:59 AM IST

Residents of East Godavari convey wishes in a novel way

తెలంగాణ ర‌థ‌సార‌ది కేసీఆర్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఉద్య‌మంలో.. ఉద్య‌మం కోసం ఆయ‌న చేసిన త్యాగాలు.. శ‌త్రువును కూడా స‌మ్మోహ‌నం చేసే ప్ర‌‌వాహం లాంటి ప్ర‌సంగాలు, ప్ర‌త్యర్దుల‌ను రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు ఆయ‌న వేసే ఎత్తులు, రాష్ట్రం సాధించాక ఆయ‌న అందిస్తున్న పాల‌న‌.. ఒక్క‌టేంటి.. ఇలా ప్ర‌తి విష‌యంలో ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ త‌మ అభిమానాన్ని చాలా సంద‌ర్భాల‌లో చాట‌డం చూశాం.

తాజాగా పిబ్ర‌వ‌రి 17న‌ ముఖ్యమంత్రి కేసీఆర్ 67 జ‌న్మ‌దినాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా వాసులు.. కేసీఆర్ ప‌ట్ల తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులైన పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.




Next Story